ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో 2005 లో ప్రభుత్వం పేద రైతులకు పంచిన భూమిని తిరిగి తీసుకుంటుందని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారికి నర్సొళ్ల రాజలింగం వార్డు మెంబర్ తుమ్మ బాబు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వేనెంబర్ 272 లో ఒక ఎకరం చొప్పున సుమారు 250 మంది రైతులకు భూమిని పంచిందన్నారు. పట్టా సర్టిఫికెట్లు, పాస్ బుక్కులు, ప్రొసీడింగ్స్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన భూమిని పేద రైతుల దగ్గర నుండి అన్యాయంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో భూమిలేని పేదలకు ఇచ్చిన భూమిని తిరిగి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయకుండా తీసుకోవడం ఇది హేయమైన చర్య ప్రభుత్వ స్పందించి పేద రైతులందరికీ ఆదుకుని వారికి తగిన న్యాయం చేయాలని కోరారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
