కొత్తగూడెంలో మోడిఫైడ్ సైలెన్సర్లపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్..

12 వాహనాలపై కేసులు

కొత్తగూడెంలో మోడిఫైడ్ సైలెన్సర్లపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్..

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ మోడిఫైడ్ సైలెన్సర్లతో సంచరిస్తున్న ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 12 ద్విచక్ర వాహనాలు చట్టవిరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లతో నడుస్తున్నట్లు గుర్తించారు.ఈ సందర్భంగా ఆయా వాహనదారులపై మోటారు వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 190(2) ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. అనంతరం వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం వల్ల తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఇటువంటి మార్పులు చట్టవిరుద్ధమని, వాహనదారులు కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.