శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.
కామారెడ్డి /బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల పరిధిలో దొరికి గ్రామంలో నాలుగు ఇండ్లు శిధిలావస్థలో ఉన్నట్లు శనివారం గుర్తించినట్లు మండల తాసిల్దార్ సువర్ణ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు పురాతన ఇండ్ల లో నివాసముండే వారి కి పునరావాసం కల్పించే విధంగా ప్రభుత్వా నిబంధనల కు లోబడి వారిని సురక్షిత ప్రాంతాని కి ఇండ్ల కు చేర్చే విధంగా చర్యలు చేపట్టినట్లు తాసిల్దార్ అన్నారు. శిధిలావస్థ లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వర్షాకాలం పూర్తి వరకు సురక్షితమైన ఇంటి లో నివాసం ఉండే విధంగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దొరికి గ్రామ సర్పంచ్ ఉడుతల ఉమా నారా గౌడ్, రెవెన్యూ అధికారులు తదితరు పాల్గొన్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
