దేవాలయాల బోర్లను ఛేదించిన రామడుగు పోలీసులు
- ఒకరు అరెస్ట్ - బంగారం, వెండి, నగదు స్వాధీనం
- అదనపు డీసీపీ వెంకటరమణ
కరీంనగర్, : కరీంనగర్ జిల్లా లో పలు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని రామడుగు పోలీసులు అరెస్ట్ చేసినారు ఈ సందర్భంగా అదనపు డిసిపి వెంకటరమణ వివరాలకు వెల్లడిస్తూజగిత్యాల జిల్లా చీలాల్ గ్రామానికి చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్, 30 సం, కరీంనగర్ సహతీనగర్‌లో పీఓపీ పనులు చేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు రాత్రి సమయంలో దేవాలయాల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, హుండీల నగదును దొంగిలిస్తున్నాడు అతని దగ్గర నుంచిరూ.9,500 నగదు, 4 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 25.07.2026 రాత్రి వేదిర గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో 1 గ్రాము బంగారు పుస్తెలు, 14 గ్రాముల వెండి, రూ.4,500 నగదు చోరీ చేశాడు. 26.07.2026న వేదిరలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో 2.5 గ్రాముల బంగారం, అర కిలో వెండి, రూ.5,000 నగదు ఎత్తుకెళ్లి టవర్ సర్కిల్‌లోని మల్లికార్జున జ్యువెలరీ షాపులో అమ్మాడు. సమాచారంతో రంగంలోకి దిగిన రామడుగు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి 3 వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. జ్యువెలరీ షాపు నుంచి 1 వెండి కిరీటం, 1 వెండి చంద్రవంక, 2.5 గ్రాముల బంగారు పుస్తెలు రికవరీ చేశారు. 2025-2026లో చిగురుమామిడి, ఎల్‌ఎండి కాలనీ, రామడుగు, చెప్పదండి, గంగాధర పరిధిలోని రేకుల ఎల్లమ్మ ఆలయం, పప్పలూరు, నర్సింగాపూర్, మొగిలిపాలెం, గుండి, పోతరం, ముదుమాచిపురం, రామంపు, గోపాల్-రావుపేట, మంగళపల్లి, గట్లుబుత్కూర్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాలు, ఇండ్లలో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన సొత్తును కరీంనగర్, నిజామాబాద్ జ్యువెలరీ షాపుల్లో అమ్మి జల్సాలకు ఖర్చు చేసినట్లు తెలిపాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన సొత్తు రికవరీకి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ కేసును ఛేదించిన రామడుగు పోలీసు బృందాన్ని అదనపు డీసీపీ అభినందించారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
