చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
చౌటకూర్ ఆగస్టు 01 :- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని హొన్నాపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల జాతీయ రహదారి 161 పై బటాయించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో చౌటకూర్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందు పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొర్రా ప్రవీణ్ యాదవ్, రాష్ట్ర ట్రెజరర్ నరేన్ దేశ్‌పాండే, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు చంటి ప్రభు, ఆందోల్ అసెంబ్లీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కన్వీనర్ పల్లె ప్రభుకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, విద్యార్థులు నిరసన చేపట్టారు. ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించేలా సీఎం చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం నాయకులు తీవ్రంగా ఖండించారు.
Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
