బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి నూతన వైద్యాధికారులు, నర్సులు

బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి నూతన వైద్యాధికారులు, నర్సులు

  • మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘన సన్మానం,
  • ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపిన చైర్‌పర్సన్ సీమ సెట్కార్   బిచ్కుంద

బిచ్కుంద,: స్థానిక ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రికి నూతనంగా నియమితులైన 4 గురు వైద్యులు, 17 మంది నర్సులను శనివారం బిచ్కుంద మున్సిపల్ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. మున్సిపల్ చైర్‌పర్సన్ సీమ సెట్కార్, వైస్ చైర్మన్‌లతో పాటు కౌన్సిలర్లు ఆసుపత్రిని సందర్శించి నూతన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సీమ సెట్కార్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే సహకారంతోనే ఆసుపత్రికి ఒకేసారి 21 మంది నూతన సిబ్బందిని నియమించుకోవడం సాధ్యమైందని, ఇందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వైద్యులు, నర్సులు రోగులకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో సేవలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.– విజన్ ఆంధ్ర ప్రతినిధి, రవీందర్.
 
Cichkunda 02
Views: 85

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.