కరీంనగర్ ను ఆదర్శ నగరంగా తీర్చిద్దుతా

మరిన్ని కేంద్ర నిధులు తెస్తా: బండి సంజయ్

 కరీంనగర్ ను ఆదర్శ నగరంగా తీర్చిద్దుతా

కరీంనగర్, : కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని, నగర అభివృద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. శనివారం కరీంనగర్ పర్యటనలో భాగంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 48వ డివిజన్ విద్యానగర్ కురుమవాడలో రూ.కోటి అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.80 లక్షలు యూఐడీఎఫ్, రూ.20 లక్షలు మున్సిపల్ ఫండ్ నిధులు ఉన్నాయి. 19వ డివిజన్ రేకుర్తి ముదిరాజ్ కాలనీలో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు, లక్ష్మీ నరసింహ కాలనీలో రూ.57 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మొగ్దుంపూర్ లో రూ.10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని, రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంటలో వనమహోత్సవం-2026" లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఇప్పటికే స్మార్ట్ సిటీ కింద రూ.900 కోట్లు, అమృత్ 1, 2 కింద రూ.279 కోట్లు, అర్బన్ డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్లు, తీగలగుట్టపల్లి ఆర్వోబీకి రూ.156 కోట్లు తెచ్చామని తెలిపారు. తాజాగా రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారబోతున్నాయని, మోడల్ రోడ్లు, స్కై వాక్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని, శివారు గ్రామాల్లో గల్లీగల్లీలో సీసీ రోడ్లు వేస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి ఇప్పటికే రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామని, త్వరలో మరిన్ని కేంద్ర నిధులు తెస్తామని వెల్లడించారు.
1004694702
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.