మెదక్ జిల్లాకు అండర్-19 ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీని నియమించాలని వినతిపత్రం

మెదక్,  : మెదక్ జిల్లాకు అండర్-19 ఎస్‌జీఎఫ్‌ఐ (SGFI) జిల్లా సెక్రటరీని తక్షణమే నియమించాలని కోరుతూ తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (PETA-TS) నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఐఈఓ)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర పునర్విభజన అనంతరం సిద్దిపేట మరియు సంగారెడ్డి జిల్లాల్లో అండర్-19 ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా సెక్రటరీలను నియమించి క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, మెదక్ జిల్లాలో ఇప్పటివరకు సెక్రటరీని నియమించకపోవడం వల్ల క్రీడా కార్యకలాపాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎస్‌జీఎఫ్‌ఐ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడిని మెదక్ జిల్లా అండర్-19 ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీగా వెంటనే నియమించాలని డీఐఈఓను కోరారు. విద్యార్థుల క్రీడా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో PETA-TS తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జిల్లా కార్యదర్శి మధు, రాష్ట్ర కార్యదర్శి మాధవ రెడ్డి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు విజయ్ కృష్ణ నర్సింలు బసవరాజ్ కృష్ణ శోభ శృతిగీత తో పాటు పలువురు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి