ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు
పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు
- అవగాహన లేకుండా మాట్లాడుతున్న బిజెపి నాయకుడు సురేష్ రెడ్డి
- అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకుడు సురేష్ రెడ్డి
- చేతనైతే గ్రామాలకు వచ్చి నిరూపించు..
- ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్
ఓదెల : ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ బిజెపి పార్టీ చెందిన నాయకుడు గొట్టె ముక్కుల సురేష్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని పొత్కపల్లి పిఎసిఎస్ చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు రూపు నారాయణపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చేతనైతే ఆ గ్రామాలకు వచ్చి నిరూపించాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో హమాలీ లతో గాని నిర్వాహకులతో గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సజావుగా కొనుగోలు సాగిందని,రైతులకు డబ్బులు కూడా సకాలంలో అకౌంట్లో చేరాయన్నారు.పేటకు చెందిన రైతులు అంగిడి తిరుపతి,జీ రమేష్, బొంగోని నారాయణ లు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కటింగులు,అక్రమాలకు అవినీతి లేకుండా రైతుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు స్థానిక శాసనసభ్యులు విజయ రమణారావు ప్రత్యేక చెరువుతో రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తూ, కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి అండగా నిలిచారన్నారు.అవగాహన లేక అసత్యాలు ప్రచారం చేసిన బిజెపి నాయకుడు గొట్టముక్కుల సురేష్ రెడ్డి తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి,మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి,సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి,రూపు నారాయణ పేట సర్పంచ్ బొంగోని రమ -శ్రీనివాస్ గౌడ్,అంకం రమేష్,నీర్ల శ్రీనివాస్,రెడ్డి రజినీకాంత్,గుండేటి ఐలయ్య యాదవ్,జిలుక సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
