వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది

మానేరు డ్యాం నిండుతుంది ఈత కొట్టడానికి రండి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది

కరీంనగర్ :వర్షాభావ పరిస్థితిని వాడుకొని బీఆర్ఎస్ పార్టీ పబ్బం గడుపుకోవాలని చూసిందని, వరుణదేవుడు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నాడని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారుశనివారం ముఖరంపుర లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కమీషన్ల కక్కుర్తితో కూలిన మేడిగడ్డ బ్యారేజీ మచ్చను దాచడానికి కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేశారని విమర్శించారు. కూలిన ప్రాజెక్టు నుండి నీళ్లు లిఫ్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఫీట్లు చేశారని మండిపడ్డారు. ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి వరప్రదాయిని అయ్యిందని, మిడ్ మనేరు గుండె కాయ అయ్యిందని పేర్కొన్నారు.  ప్రపంచమంతా ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలనను చూసి వరుణదేవుడు మంచి వర్షాలు కురిపిస్తున్నాడని, అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని తెలిపారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన మేడిగడ్డ బ్యారేజీ ఆనాడైనా ఈనాడైనా పనికి రాలేదన్నారు మానేరు డ్యాంలో నీళ్లు లేవని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫుట్ బాల్, క్రికెట్ ఆడి ప్రజలను తప్పుదోవ పట్టించారని, ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలలో 7 టీఎంసిలే ఉంటాయని అధికారిక లెక్కలు చూపిస్తే తోక ముడుస్తారని ఎద్దేవా చేశారు. కొద్ది రోజుల్లో మిడ్ మానేరు నుండి లోయర్ మానేరుకు నీటిని విడుదల చేస్తామని, నిండిన డ్యాంలో ఈత కొట్టడానికి గంగుల సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.  బీఆర్ఎస్ హయాంలో స్మార్ట్ సిటీ పనులు అవినీతిమయంగా, అశాస్త్రీయంగా జరిగాయని ఆరోజే కాంగ్రెస్ మొత్తుకున్నా గంగుల పట్టించుకోలేదని, ఈ రోజు ఇద్దరు మాజీ మేయర్లు దానిని ధృవీకరిస్తున్నారని అన్నారు. భగత్ నగర్ లో జరిగిన దొంగతనంపై ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని, పోలీసులు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజాపాలన కొనసాగుతోందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని, గంగుల అంతగా రంది పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, గుడిపాటి రమణారెడ్డి, తోట అంజయ్య, బషీర్, భారీ, మాసుం ఖాన్, ఇమ్రాన్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. 
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.