తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆయన మరణవార్తతో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయం నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలిస్తుండటంతో.. అశేష జనవాహిని నర్సంపేట వైపు కదలివస్తోంది. తమ ప్రియతమ నాయకుడిని ఆఖరిసారి చూసుకునేందుకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు.నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో వేచి చూస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా తోటి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ నర్సంపేట నినాదాలతో మారుమోగుతోంది.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
