కర్కపట్ల గ్రామంలో భారీగా మద్యం, బైకులు స్వాధీనం
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కర్కపట్ల గ్రామంలో శుక్రవారం గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం' నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏసీపీ గజ్వేల్, సీఐలు, ఎస్‌ఐలు మరియు 111 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం సిబ్బందిని 9 ప్రత్యేక బృందాలు గా విభజించి, గ్రామంలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పాత్రలు లేని 32 బైకులు, వాహనాలను, బెల్ట్ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 29 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి నర్సింలు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులకు, అనుమానాస్పదంగా ఉండే నూతన వ్యక్తులకు ఎలాంటి గుర్తింపు కార్డులు మరియు పూర్తి వివరాలు లేకుండా ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలన్నారు. గ్రామంలో ఎవరైనా ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేశారు. గ్రామంలో భద్రత పెంచడానికి, నేరాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వీధుల్లో, కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సరైన పత్రాలతో ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. గ్రామంలో శాంతియుత వాతావరణానికి, నేర రహిత సమాజ స్థాపనకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్దన్ సెర్చ్ లో ఏసిపి గజ్వేల్ తో పాటు గజ్వేల్ రూరల్ సీఐ రవి రాజు, తొగుట సీఐ లతీఫ్, మర్కుక్ ఎస్ఐ యూనిస్ మిగతా గజ్వేల్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు.
Views: 165
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
