గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ హాజరుకాగా, ఫారెస్ట్ అధికారి పవన్ కుమార్ మరియు ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర రేంజర్లు మరియు అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్.ఆర్.ఓ వినాయక్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి అడవులు, అమూల్యమైన వన్యప్రాణులను కాపాడటంలో ఫారెస్ట్ రేంజర్లు, ఫీల్డ్ సిబ్బంది పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా విధి నిర్వహణలో ప్రదర్శిస్తున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రతి ఒక్కరు చెట్లను నాటి సంరక్షించాలని, అటవీ సంపద మరియు వన్యప్రాణుల రక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని తెలిపారు. ఈ వేడుకల్లో అటవీ శాఖకు చెందిన సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
