దౌల్తాబాద్‌లో బైక్ చోరీ.. నిందితుడికి రిమాండ్
దౌల్తాబాద్,/సిద్దిపేట :దౌల్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన బైక్ చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గంగాధర అరుణ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం సమీపంలోని కల్లు కాంపౌండ్ వద్ద పార్క్ చేసిన బైక్‌ను కొండాపూర్ గ్రామానికి చెందిన వరదం యాదగిరి దొంగిలించాడు. అనంతరం వాహనాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా దౌల్తాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనాలను పార్క్ చేసే సమయంలో తప్పనిసరిగా లాక్‌లు, ఇతర భద్రతా పరికరాలను వినియోగించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


