అభిమానానికి అక్షర రూపం… చేతిపై బండి సంజయ్ టాటూ

మల్యాల మండలం లంబాడిపల్లి యువకుడి వినూత్న అభిమానం

అభిమానానికి అక్షర రూపం… చేతిపై బండి సంజయ్ టాటూ

జగిత్యాల జిల్లా ​మల్యాల,: రాజకీయ నాయకులపై అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ, జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు ప్రదర్శించిన అభిమానం మాత్రం గ్రామంలోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ​లంబాడిపల్లి గ్రామానికి చెందిన దూస మహేష్ అనే యువకుడు కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై తనకున్న నిష్కల్మషమైన ప్రేమాభిమానాలను చాటుకోవడానికి ఏకంగా తన చేతిపై ఆయన చిత్రాన్ని టాటూ గా చెక్కించుకున్నాడు. ​ఈ సందర్భంగా దూస మహేష్ మాట్లాడుతూ... "బండి సంజయ్ అన్న నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల కోసం ధైర్యంగా పోరాడే నైజం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన నాయకత్వ పటిమ, ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న తపన నాలాంటి ఎంతో మంది యువకులకు స్ఫూర్తిదాయకం. నా గుండెల్లో ఉన్న అభిమాన నాయకుడి రూపం ఎప్పటికీ నాతోనే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ టాటూ వేయించుకున్నాను అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
Views: 116

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.