పట్నం కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

 - కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన టీపీసీసీ చీఫ్

పట్నం కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

షాబాద్,(రంగారెడ్డి) తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి  పట్నం రుక్కమ్మ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.శనివారం పట్నం మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మహేష్ కుమార్ గౌడ్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం పట్నం మహేందర్ రెడ్డితో పాటు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని,కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం కలగాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, కావలి చంద్రశేఖర్,పామేన భీం భరత్,షాబాద్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ దండు రాహుల్ పాల్గొని రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.