ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం.

జిల్లాలో 95 మంది బాలకార్మికులకు విముక్తి

ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం.

కొత్తగూడెం : ఆగస్టు 1: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు విశేష ఫలితాలు సాధించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 95 మంది బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు.జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రత్యేక బృందాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు. గుర్తించిన 95 మంది బాలల్లో 89 మంది బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న 48 మంది యజమానులపై కేసులు నమోదు చేయగా, మరో 38 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎక్కడైనా చిన్నారులను పనిలో పెట్టుకున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్–XIIను విజయవంతంగా నిర్వహించి బాలలను వారి కుటుంబాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.