బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ
మందమర్రి, (మంచిర్యాల) : ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులలో వంద శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు మందమర్రి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను జీఎం వెల్లడించారు. జూలై నెలకు సంబంధించి 106% బొగ్గు ఉత్పత్తితో పాటు 105% ఓవర్ బర్డెన్ (ఓబీ) సాధించినట్లు చెప్పారు. అలాగే కేకే 5,కేకే ఓసి గనులలో వంద శాతం బొగ్గు ఉత్పత్తి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అంతర్గత గనులలో కార్మికుల గైర్హాజార్ కారణంగా బొగ్గు ఉత్పత్తికి కొంత విఘాతం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి ఝా, డీజీఎం పర్సనల్ అశోక్, డీజీఎం ఐఈడి కిరణ్ కుమార్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
