సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి
సంగారెడ్డి / చౌటకూర్ : చౌటకూర్ మండలం శివంపేట గ్రామ పరిధిలోని 'సిబియల్' పరిశ్రమలో గడిచిన కొన్నేళ్లుగా వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అయితే పరిశ్రమ యాజమాన్యం అర్ధాంతరంగా ఉత్పత్తులను నిలిపివేయడంతో కార్మికులంతా రోడ్డున పడ్డారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పరిశ్రమ వద్ద కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ... జాతీయ రహదారి విస్తరణ సమయంలో కంపెనీ ముందు సహజసిద్ధంగా వర్షపునీరు వెళ్ళే దారి (నేచురల్ డ్రైన్) మూసుకుపోయిందన్నారు. దీనివల్ల వర్షం పడినప్పుడు లోతట్టు ప్రాంతంలో ఉన్న కంపెనీలోకి జాతీయ రహదారి పైనుండి నీరు వచ్చి చేరుతోందని, ఆ నీటిని మోటార్ల ద్వారా యాజమాన్యం బయటకు పంపుతోందని వివరించారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా కలుష్య నీటిని నదిలో కలుపుతున్నారని ఫిర్యాదు చేయగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపకుండానే షోకాజ్ నోటీసు ఇచ్చారని మండిపడ్డారు. దీంతో యాజమాన్యం తాత్కాలికంగా ఉత్పత్తులను నిలిపివేసిందని, ఫలితంగా కార్మికులకు పని లేకుండా పోయిందని విమర్శించారు.2000 కుటుంబాల ఉపాధిపై దెబ్బ ఇప్పటికే కంపెనీలో సరైన ఉత్పత్తి లేక కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కేవలం 15 రోజులే పని దొరుకుతోందని, ఇప్పుడు ఆ పని కూడా పోవడంతో కంపెనీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు 2,000 మంది ఉపాధి దెబ్బతిన్నదని అన్నారు. ఒకవేళ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను బయటకు వదిలితే జిల్లా యంత్రాంగం చట్ట ప్రకారం కంపెనీపై చర్యలు తీసుకోవాలని, అంతేతప్ప కార్మికుల బ్రతుకుతెరువును ఎందుకు దెబ్బతీస్తున్నారని ప్రశ్నించారు.కంపెనీలో వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి అవసరమైన ప్లాంట్ (ETP) అందుబాటులోనే ఉందని, శుద్ధి చేసిన నీటిని యంత్రాల క్లీనింగ్, గార్డెనింగ్ మరియు వాష్‌రూమ్‌లకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. మిగిలిన వ్యర్థ జలాలను ట్యాంకర్ల ద్వారా పటాన్‌చెరులోని ప్లాంట్‌కు తరలిస్తున్నారని, కేవలం వర్షం వచ్చినప్పుడు మాత్రమే వర్షపు నీటిని బయటకు పంప్ చేస్తున్నారని స్పష్టం చేశారు. డిమాండ్లు:అధికారులు తక్షణమే స్పందించి కార్మికులకు ఉపాధి కోల్పోకుండా ఉద్యోగ భద్రత కల్పించాలి. వర్షం నీరు కంపెనీలోకి రాకుండా, బయటకు వెళ్లడానికి అవసరమైన సహజ డ్రైనేజీ దారిని పునరుద్ధరించాలి. ఈ ఆందోళన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. మల్లేశం, ఉపాధ్యక్షులు & యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి. భాగారెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ప్రసన్న రావు, కాంట్రాక్టు కార్మికుల యూనియన్ జనరల్ సెక్రటరీ సురేష్, ఇతర నాయకులు, పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
