దేవరకద్రలో బలపడిన టీయూడబ్ల్యూజే ఐజేయు
అధ్యక్షుడిగా యాకూబ్, కార్యదర్శిగా సారంగం
మహబూబ్ నగర్ (దేవరకద్ర): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పోరాడుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్, దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యంత బలమైన అతిపెద్ద యూనియన్‌గా ఆవిర్భవించింది. దేవరకద్రలో నిర్వహించిన ముఖ్య సమావేశంలో పలువురు విలేకరులకు నూతన సభ్యత్వాలు అందజేయడంతో పాటు, మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కాటం నాగరాజు గౌడ్,కార్యదర్శి సతీష్ రెడ్డి, కోశాధికారి జిల్లేల రఘు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు,సంఘం బలోపేతం,భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. విలేకరుల ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ కార్డుల పంపిణీ, అక్రమ కేసుల నిరోధం వంటి అంశాలపై యూనియన్ రాజీలేని పోరాటం చేస్తుందని జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. దేవరకద్ర మండల టీయూడబ్ల్యూజే (ఐజేయు) నూతన అధ్యక్షుడిగా యాకూబ్ ('వార్త'), ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా సారంగం, సంయుక్త కార్యదర్శిగా మీర్జా వాసిం బేగ్, కోశాధికారిగా ప్రశాంత్ ఎన్నుకోబడ్డారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా షఫీ, రాజేందర్ గౌడ్, నరేష్ కుమార్,జంగం రవి, సంతోష్, సాయికిరణ్, రాఘవేందర్, పవన్ కళ్యాణ్, ఎం.డి. ఫరీద్‌లను నియమించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో నూతన కార్యవర్గం ఎల్లప్పుడూ ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో, సభ్యత్వాల నెపంతో వస్తున్న ప్రత్యర్థి యూనియన్ గడిచిన పదేళ్ల కాలంలో ప్రభుత్వంతో అంటకాగిందే తప్ప జర్నలిస్టులకు చేసిందేమీ లేదని, కేవలం స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిందని సీనియర్ జర్నలిస్టులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో గళమెత్తుతామని నూతన కమిటీ స్పష్టం చేసింది.
Views: 89
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
