వీఆర్ఏ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు 

వీఆర్ఏ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు 

కారేపల్లి (ఖమ్మం) : మండల తాసిల్దార్ కార్యాలయంలో బినామీ పేరుతో వీఆర్ఏగా కొనసాగుతున్న కల్లోజి శ్రీనివాసు ద్వారా మండల పరిధిలోనీ చెమలపాడు,బాజుమల్లయ్య గూడెం గ్రామానికి చెందిన అనేకమంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆరోపిస్తూ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేసి,అనంతరం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. రెండు పంచాయతీలలో రైతులకు సంబంధించిన అనేక విషయాలను బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ శ్రీనివాస్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వారు డిప్యూటీ తాసిల్దార్ కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు.శ్రీనివాస్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.అనంతరం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులు మాలోత్ కిషోర్, గుజ్జర్లపూడి సైదులు,పాటీ రమేష్,పాటి రంగయ్య,మాలోత్ స్వామి,పోతుల సత్యమయ్య పోతుల వెంకటేశ్వర్లు,బానోత్ భాషూ,కొండం వెంకటేశ్వర్లు,పాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి