సోషల్ మీడియాలో దుష్ప్రచారం మానుకోవాలి 

పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ 

సోషల్ మీడియాలో దుష్ప్రచారం మానుకోవాలి 

 
 

మందమర్రి, (మంచిర్యాల): నేషనల్ హైవే 363 అనుకోని ఉన్న సర్వీస్ రోడ్ కల్వర్టును పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి విడియో,వ్యాఖ్యలను వక్రీకరించి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ హెచ్చరించారు. సంబంధిత శాఖల అధికారులకు సమస్యను తెలిపేందుకు ఫోటోలు తీయించారు తప్ప ఫోజుల కోసం కాదన్నారు. శనివారం స్థానిక క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బపల్లి సర్వీస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఎక్కడ పనుల పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించకుండా మంత్రి వ్యాఖ్యాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్,భీమ మల్లేష్,కూతురు ప్రభాకర్,శిరీష,సృజన,మాజీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,మాజీ కౌన్సిలర్ పొలం సత్యం,గోవు రాజాం,మొట్టే సుధాకర్,ఎల్పుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Views: 33

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.