వట్టిపల్లి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

వట్టిపల్లి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

గజ్వేల్ / సిద్దిపేట : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖులు, పాఠశాల పూర్వ విద్యార్థుల కుటుంబ సభ్యులు తాడూరి నరసింహారెడ్డి (రిటైర్డ్ పి.జి.హెచ్.ఎం.), తాడూరి రాంరెడ్డి (రిటైర్డ్ ఎంఇవో, ములుగు), తాడూరి నరేష్ రెడ్డి (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అమెరికా), తాడూరి జయ (నరసింహారెడ్డి ధర్మపత్ని) జ్ఞాపకార్థం వట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్సులను బహుకరించారు. బాలవికాస విద్యా కమిటీ చైర్మన్ తాడూరి వెంకట రామిరెడ్డి ప్రత్యేక చొరవతో, వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం సాకారమైంది. గ్రామ విద్యార్థుల క్రీడా వికాసానికి, పాఠశాల అభివృద్ధికి తాడూరి కుటుంబ సభ్యులు అందిస్తున్న ఉదారమైన సహకారాన్ని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని సరోజ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షించి క్రీడా దుస్తులను విరాళంగా అందించిన తాడూరి నరసింహారెడ్డి, రాంరెడ్డి, నరేష్ రెడ్డి దాతృత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే, పాఠశాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, దాతలను ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన బాలవికాస విద్యా కమిటీ చైర్మన్ తాడూరి వెంకట్రామిరెడ్డి కి పాఠశాల బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విజయభాస్కర రెడ్డి, పరశురాములు, బాల నర్సింహరెడ్డి, మల్లయ్య, బాపురెడ్డి, రవి రాజులతో పాటు పలువురు గ్రామ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.