సీఎంవ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేవైఎం
దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు - నేతలను పీటీసీకి తరలింపు
కరీంనగర్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో భారీ నిరసన నిర్వహించారు.ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నారు. వాళ్లను పిలిచి ఓ పేపర్ ఇచ్చి జాబ్ అప్లికేషన్ నింపమని చెప్పండి..ఇది క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలు లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, యువతను కించపరిచే విధంగా ఉన్నాయని, చదువుకున్న యువత ప్రతిభను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసి పీటీసీకి తరలించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేవైఎం శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంగ నరేష్, నక్క ప్రమోద్, గుర్రం వెంకటేష్ గౌడ్ తో పాటు పెద్ద సంఖ్యలో బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
