అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

 కరీంనగర్:  కరీంనగర్ జిల్లాలోని పలు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు గంగాధర ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 20, హుజురాబాద్ లో 16, కరీంనగర్ రూరల్ పరిధిలో 16, కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో 8 అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న మహిళలు మాత్రమే పోస్టులకు అర్హులని, అభ్యర్థి సంబంధిత అంగన్వాడి కేంద్రం పరిధిలోని గ్రామపంచాయతీ, పట్టణాలు, నగరంలో అయితే వార్డు/ డివిజన్ లో స్థానికురాలు అయి ఉండాలని తెలిపారు. 01.07.2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాలు లోపు మహిళలు అర్హులని తెలిపారు. ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, రిజర్వేషన్ తదితర వివరాల కోసం https://wdcw.tg.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని, ఈ వెబ్సైట్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. 
 
Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.