నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
మందమర్రి, (మంచిర్యాల) : ప్రజలతో మమేకమై నేరాల నివారణకు పోలీసులు కృషి చేయాలని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం మందమర్రి పోలీస్ స్టేషన్ ను ఏసీపీ తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలతో పాటు సంబంధించిన ఫైల్ రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదులు, కేసులను పెండింగ్లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. సిబ్బంది విధులను నిరంతరం పర్యవేక్షిస్తూ,సమర్థవంతంగా పనిచేసేలా చొరవ చూపాలని సీఐ పర్ష రమేష్,ఎస్సై గోపతి నరేష్ లకు సూచించారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
