సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జీఎంగా సీహెచ్ వెంకట రమణ బాధ్యతల స్వీకారం

సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జీఎంగా సీహెచ్ వెంకట రమణ బాధ్యతల స్వీకారం

కొత్తగూడెం, : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా  సీహెచ్ వెంకట రమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏరియాలోని వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీహెచ్ వెంకట రమణ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధన, కార్మికుల భద్రత, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సమష్టి కృషితో కొత్తగూడెం ఏరియాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.ఏరియాలోని గనులు, అనుబంధ విభాగాల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్ఠంగా అమలు చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా న్ని వినియోగించి ఉత్పాదకత పెంపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వ యంతో పనిచేసి సంస్థ పురోగతికి తమవంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం ఎం. గోవిందరావు, ఏజీఎం (ఫైనాన్స్) బిబత్స, ఏజీఎం (సివిల్) సీహెచ్ రామకృష్ణ, డీజీఎం (ఐఈడీ) యోహాన్, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, సీఎంఓఏఐ జనరల్ సెక్రటరీ ఉపేందర్, పర్సనల్ మేనేజర్ తిరుపతి, సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ తౌర్యా, కె. రాజారాం, వీకేసీఎం మేనేజర్ మురళి, డీజీఎం స్టోర్స్ మైనేని శ్రీనివాస్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొని నూతన జనరల్ మేనేజర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Views: 101

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.