తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : గజ్వేల్ ఏసీపీ నర్సింలు శుక్రవారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్దిపేట జిల్లా తోగుట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణతో పాటు అన్ని విభాగాలను ఆయన కూలంకషంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, కేసు ప్రాపర్టీ, స్టేషన్ పరిసరాల్లో ఉన్న కేసు సంబంధిత వాహనాలను ఏసీపీ స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తోగుట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సైబర్ క్రైమ్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, మరియు సీసీటీఎన్‌ఎస్ విభాగాల పనితీరును సమీక్షించి, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సింలు మాట్లాడూతూ పోలీస్ స్టేషన్‌కు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదుదారులతో నిబద్ధతతో, గౌరవప్రదంగా మరియు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ఆర్థిక నేరాలు, దొంగతనాలు మరియు ఇతర నేరాల దర్యాప్తును ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా, వేగవంతంగా పూర్తి చేయాలని తోగుట ఎస్‌ఐ నవీన్ మరియు స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు.ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో తోగుట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లతీఫ్,ఎస్‌ఐ నవీన్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Views: 33
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
