కెసిఆర్ హయాంలో ఆదుకున్నాం..
కాంగ్రెస్ మోసం చేసింది
ఆటో కార్మికుల దినోత్సవంలో గంగుల కమలాకర్ ఆగ్రహం
కరీంనగర్ :గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలిచామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి మోసం చేసిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంఘం జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఆటో కార్మికులవని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ఆటో కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ప్రమాదవశాత్తు మరణించిన ఆటో కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షలు అందించామని తెలిపారు. అదేవిధంగా ఆటో ఫిట్‌నెస్ కోసం చెల్లించాల్సిన సుమారు రూ.350 కోట్లను ప్రభుత్వమే విడుదల చేసి కార్మికులపై భారం పడకుండా చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, ఈఎంఐలు కట్టలేక కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులకు ఏటా రూ.12,000 భృతి చెల్లించడంతో పాటు, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
