హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి

హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి

గజ్వేల్ /సిద్దిపేట : ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్.ఎస్.ఆర్.పి.) మాత్రమే చట్టబద్ధమైనవని, నకిలీ, మార్పులు చేసిన, స్టిక్కర్ ఆధారిత, డూప్లికేట్ లేదా అస్పష్టంగా కనిపించే నెంబర్ ప్లేట్లను వాహనాలపై అమర్చడం చట్టవిరుద్ధమని గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ట్రాఫిక్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఆమోదించిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించడం ద్వారా వాహనాల అసలు గుర్తింపును దాచడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, నేర కార్యకలాపాలకు సహకరించే అవకాశం ఉన్నందున ఇటువంటి ఉల్లంఘనలను సిద్దిపేట పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ లేదా అనధికారిక నంబర్ ప్లేట్లతో సంచరించే వాహనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకుని అమల్లో ఉన్న చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని వాహన యజమానులు తమ వాహనాలకు ప్రభుత్వం ఆమోదించిన హెచ్.ఎస్.ఆర్.పి. నెంబర్ ప్లేట్ మాత్రమే అమర్చుకున్నట్లు వెంటనే ధృవీకరించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నిబంధనలను పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. 
Views: 91

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.