బట్ట కాల్చి మీద వేస్తే ఊరుకోం

లీగల్ నోటీసులు ఇవ్వండి: మేయర్, డిప్యూటీ మేయర్లకు బండి సంజయ్ ఆదేశం

బట్ట కాల్చి మీద వేస్తే ఊరుకోం

కరీంనగర్,  : యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, అయినా కావాలనే బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లు అవినీతి, అక్రమాలతో కార్పొరేషన్ ను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు అవినీతి బురద చల్లుతున్నారని మండిపడ్డారు. శనివారం కరీంనగర్ పర్యటనలో భాగంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో చర్చించిన అనంతరం యూఐడీఎఫ్ టెండర్లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. మనకు సంబంధమే లేదు. అని అన్నారు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు  అవినీతి బురద చల్లే వారిని ఉపేక్షించొద్దు వెంటనే లీగల్ నోటీసులు పంపండి. క్షమాపణ చెప్పకపోతే న్యాయ పరమైన చర్యలు తీసుకోండి. తప్పుడు కూతలు కూసే వారికి చెంప చెళ్లుమనేలా చర్యలుండాలిఅని ఆదేశించారు. బీఆర్ఎస్ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీని గెలిపించారని, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందిస్తున్న తరుణంలో ఓర్వలేక కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత పాలకులు ప్రతి పనికీ లంచాలకు అలవాటుపడి, ఇప్పుడు ఇతరులపై కూడా అదే బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు. అవినీతికి తావులేకుండా పని చేస్తున్నామని, తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు.
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.