వైన్స్ షాప్ కు జరిమానా విధించిన వేలేరు మేజర్ గ్రామపంచాయతీ
On
వేలేరు మండల కేంద్రంలోని ఒక వైన్స్ షాప్ వారు రోడ్డుపై వాహనాలు నిలుపుదల, ప్లాస్టిక్ గ్లాసులు బాటిల్స్ రోడ్డు డివైడర్ లో వేసినందుకు మరియు పారిశుద్ధ్యం సరిగా లేనందున, వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ,బిల్లా యాదగిరిఆదేశాల మేరకు, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీమతి విజయ షాపును విజిట్ చేసి 5000 రూపాయల జరిమానాను విధించడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మరియు కార్యదర్శి గార్లు మాట్లాడుతూ గ్రామంలో వివిధ షాపులు నిర్వహిస్తున్న యజమానులు విధిగా షాపు ముందు పార్కింగ్ స్థలాన్ని, పారిశుద్ధ్య నిర్వాణ సరిగా చేయాలని, తూనికలు కొలతల నాణ్యత, పాటించాలని, లేనియెడల గ్రామపంచాయతీ వారు చట్ట ప్రకారం సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసినారు. ఈ తనిఖీ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Views: 782
About The Author

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 12:25:58
లింగాల గణపురం (జనగామ): కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
