మద్నూర్ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బండివార్ హనుమండ్లు నియామకం

మద్నూర్ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బండివార్ హనుమండ్లు నియామకం

మద్నూర్, :మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్న సేన రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మద్నూర్ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బండివార్ హనుమండ్లు (తండ్రి: బి. గంగారాం) నియామకమయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహా ధర్న సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ శనివారం (ఆగస్టు 1) అధికారికంగా నియామక పత్రాన్ని జారీ చేశారు. ఈ పదవిలో ఆయన 30/07/2026 నుండి 25/08/2028 వరకు కొనసాగనున్నారు.ఈ సందర్భంగా హనుమండ్లు మాట్లాడుతూ, మున్నూరు కాపుల ఐక్యత, అభ్యున్నతి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రిజర్వేషన్ల సాధన కోసం తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని ప్రకటిం చారు. త్వరలోనే గ్రామ, మండల స్థాయిలలో సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లను, వివిధ కమిటీలను ఏర్పాటు చేసి మున్నూరు కాపు సమాజాన్ని సమన్వయపరుస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. హనుమండ్లు నియామకం పట్ల స్థానిక మున్నూరు కాపు నాయకులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Views: 96

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 314 మంది చిన్నారులకు విముక్తి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
చౌటకూర్‌లో బీజేవైఎం నిరసన
ఈత వనం పెంపకానికి శ్రీకారం
వర్షాభావాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పబ్బం గడుపుకోవాలని చూసింది
కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం మందమర్రి జిఎం రాధాకృష్ణ 
శిధిలావస్థలో నాలుగు ఇండ్లు.