తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ
చౌటకూర్, : స్వచ్ఛగ్రామాల నిర్మాణం లక్ష్యంగా చౌటకూర్ మండలం పరిధిలోని పోసానిపల్లి గ్రామంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు తడి, పొడి చెత్తను విడివిడిగా నిల్వ చేసేందుకు ప్రత్యేక చెత్త బుట్టలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయవ చ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని వివరించారు.ఎంపీవో సువర్ణ మాట్లాడు తూ, ప్రభుత్వం చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఇంటిలో చెత్తను వేర్వేరుగా నిల్వ చేయడం అలవాటు చేసుకోవాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిం చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె రేణుక బాలరాజు, ఎంపీవో సువర్ణ, ఎంపీడీవో కే. శంకర్, గ్రామ కార్యదర్శి అశోక్, ఉప సర్పంచ్ రమేష్, గ్రామ అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోళ గోపాల్, నాగరత్నం, గాడ్‌పల్లె పోచయ్య, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


