కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 7న భారీ జాబ్ ఫెయిర్.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
కొత్తగూడెం, : తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఆగస్టు 7న భారీ ప్లేస్‌మెంట్ డ్రైవ్ (జాబ్ ఫెయిర్) నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి. రమేష్ తెలిపారు.వరంగల్ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సూచనల మేరకు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఇందులో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. గతంలో ఐటీఐ, ఏటీసీలలో శిక్షణ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న ఔట్‌గోయింగ్ ట్రైనీలు ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని ప్రిన్సిపాల్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ ప్రతులు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఆగస్టు 7న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐకి హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, జాబ్ ఫెయిర్ విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి. రమేష్ తెలిపారు.
Views: 37
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
