మంజీరా నదిలో రసాయన వ్యర్థాల విడుదల ఆరోపణలు..
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్
చౌటకూర్, :చౌటకూర్ మండలం పరిధిలోని శివంపేట సమీపంలో ఉన్న ఏబీఐఎన్ చార్మినార్ బీర్ పరిశ్రమ నుంచి వర్షాకాలాన్ని సాకుగా చూపుతూ రసాయనాల కలిసిన వ్యర్థ జలాలను నేరుగా మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని స్థానిక గ్రామస్థులు ఆరోపించారు.గ్రామస్థుల కథనం ప్రకారం, పరిశ్రమ నుంచి వస్తున్న వ్యర్థాల కారణంగా నదినీటి రంగు మారడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. ఈ కాలుష్యం వల్ల పశువులు, పక్షులు, జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడటమే కాకుండా, నదిపై ఆధారపడిన ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంపై గతంలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. ప్రస్తుతం కూడా పరిశ్రమ యాజమాన్యం ఇది వర్షపు నీరేనని చెబుతోందని, అయితే నీటి రంగు మారడం, దుర్వాసన రావడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి పరిశ్రమపై సమగ్ర విచారణ నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి భారీ ఆందోళన చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు.
Views: 27
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
