ఆర్డినరీ  నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం-ప్రభుత్వం వెంటనే స్పందించాలి

ఆర్డినరీ  నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం-ప్రభుత్వం వెంటనే స్పందించాలి

నాగర్‌కర్నూల్ :. జినపల్లి :  ప్రభుత్వం ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వేళ,TGSRTC మాత్రం ఆర్డినరీ బస్సుల్లోనే ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటోంది.ఆర్డినరీ సర్వీస్ లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్డినరీ బస్సు అంటే ప్రతి స్టాప్‌లో ఆగాలి.చార్జీలు కూడా తక్కువగా ఉండాలి.కానీ ఇక్కడ ఆర్డినరీ బస్సును హైదరాబాద్ రూట్ లో నడుపుతూ ఎక్స్‌ప్రెస్ రేట్లు కొడుతున్నారు.ఒకవైపు మహిళలకు ఉచితం అని ప్రకటనలు,మరోవైపు చార్జీలు చెల్లించే సామాన్య ప్రజలను ఇలా పిండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.ఇది ఒక్క బస్సుకే పరిమితం కాదు.రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే తరహా ఆర్డినరీ బస్సులను ఎక్స్ప్రెస్ స్పెషల్ గా మార్చి అధిక చార్జీలు వసూలు వసూలు చేస్తున్నారు.TGSRTC అధికారులకు తెలియకుండా ఇలాంటి అక్రమాలకు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ జరిపి,ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్న డిపోల పై ,అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.లేకుంటే ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News