ఇసుక టిప్పర్ల దెబ్బకు ధ్వంసమైతున్న రోడ్లు

ఇసుక టిప్పర్ల దెబ్బకు ధ్వంసమైతున్న రోడ్లు

తెలకపల్లి, :మండలంలో ప్రతినిత్యం ఇసుక టిప్పర్ల రవాణాతో పలుచోట్ల రోడ్లు ధ్వంసమై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనుమతుల పేరుతో అడ్డగోలుగా వందల టిప్పర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తూ రోడ్లను నాశనం చేస్తున్నాయి ఫలితంగా బైకులు కార్లు ఆటోలు తదితర వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు తెలకపల్లి లోని మల్లెలమ్మ చౌరస్తా ఇసుక రవాణాకు అడ్డాగా మారింది ఇదే అలుసుగా తీసుకొని ఇతర జిల్లాల నుండి ఇసుక టిప్పర్లను తెప్పించి రోడ్ల వెంట మోత మోగిస్తున్నారు ప్రధానంగా ఉప్పునుంతల మండలం దాసర్ల పల్లి,దుందుభి వాగు వద్ద ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మండల పరిధిలోని నడిగడ్డ, రామగిరి తదితర చోట్ల ఇసుక డబ్బులు ఏర్పాటుచేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు తెలకపల్లి నుండి కల్వకుర్తి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇసుక టిప్పర్ల కారణంగా ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నామంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Views: 60

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News