శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్. 

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్. 

తాండూరు డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య. 
పట్టణంలోని మాణిక్ నగర్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ 
68 టూవీలర్లు,3 ఆటోలు, 54 మద్యం బాటిల్లు,1 గుట్కా ప్యాకెట్ స్వాధీనం.

తాండూరు (వికారాబాద్ జిల్లా) శాంతి భద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదయ్య పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ నేతృత్వంలో తాండూరు పట్టణ సీఐ బి పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నాలుగు గంటలకు నుండి పట్టణంలోని మాణిక్ నగర్ కాలనీలో గార్డెన్ సెర్చ్ అకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కాలనీని పూర్తిగా తమ అదుపులోకి తీసుకొని, ప్రతి ఇంటా సోదాలు చేసి, సరైన పత్రాలు లేని వాహనాలు మరియు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల అణచివేత, సరైన నంబర్ ప్లేట్లు, ధ్రువపత్రాలు లేని వాహనాల గుర్తింపు మరియు సీజింగ్ ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్డెన్ సెర్చ్ లో భాగమన్నారు. ప్రజలలో భద్రతా భావన్ని పెంపొందించడం, అనుమానితులను విచారించడం ఇందులో భాగమన్నారు. ఈ తనిఖీలలో 68 టూవీలర్లు,3 ఆటోలు , 54 మద్యం బాటిల్లు , ఒక గుట్కా ప్యాకెట్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయి, మట్కా, అక్రమ మద్యం, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి చెడ్డ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని హెచ్చరించారు. కాలనీ ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలలో తాండూరు సబ్ డివిజన్ పరిధి యాలాల పెద్దముల్, బషీరాబాద్, తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 
 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్