గాంధారి మైసమ్మ బోనాల జాతరకు ఏర్పాట్లు పూర్తి
- -రెండు వందలకు పైగా బోనాలు
- -భక్తులకు క్యూ లైన్ల ఏర్పాటు
- -పోలీసుల భారీ బందోబస్తు
మందమర్రి, (మంచిర్యాల) : ప్రతి ఏటా ఆషాడ మాస బోనాల పండుగలో భాగంగా నిర్వహించే బొక్కల గుట్ట హైవే గాంధారి మైసమ్మ తల్లి బోనాల జాతరకు సర్వం సిద్ధం చేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాతరలో గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు. సుమారు 300 మంది పోలీసులు బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయానికి రానున్నారు. కాగా శుక్రవారం జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, గౌరవ అధ్యక్షుడు పారిపెల్లి తిరుపతి తెలిపారు. పోలీస్,ఫారెస్ట్,మున్సిపల్ అధికారులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో జాతర జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను నిత్యం పర్యాయవేక్షిస్తున్నట్లు తెలిపారు. వాహన పూజలు,దర్శనం,కొబ్బరికాయలు,కోళ్ళు,మేకల కటింగ్ కొరకు ప్రత్యేక టికెట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రెండు వందలకు పైగా బోనాలు
ఈ సారి బొక్కల గుట్ట మైసమ్మ బోనాల జాతరలో రెండు వందలకు పై చిలుకు బోనాలను అమ్మవారికి సమర్పించనున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బోనాలకు ముందుగానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. కాగా సమీపంలోని చెట్టు వద్ద నుంచి బోనాలను డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలో సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సాంప్రదాయం 25 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుందని కమిటీ సభ్యులు చెప్తున్నారు.
మూడు వందల పోలీసులతో బందోబస్తు
ఈ నెల 9 న ఆదివారం జరిగే బోనాల జాతరకు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పర్ష రమేష్,ఆర్కేపీ ఎస్సై జాడి శ్రీధర్ నేతృత్వంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందితో భద్రత,బందోబస్తు చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారని డీసీపీ ఎగ్గడి భాస్కర్ చెప్పారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏర్పాటు చేసిన పార్కింగ్ కేంద్రాలలో వాహనాలను ఉంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు బోనాల జాతరను జరుపుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.

Views: 533
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
