విద్యుత్షాక్ తో ఎద్దు మృతి
ముధోల్ :ముధోల్: మండలంలోని ముద్గల్ గ్రామానికి చెందిన కోర్ల సాయిలు అనే రైతుకు చెందిన ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మృతిచెందినట్లు రైతు తెలిపారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రాత్రి పిప్రి గ్రామ శివారులో మేత మేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ తీగకు తగిలి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. ఈ విషయమై సంబంధిత విద్యుత్ ఏఈ శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. శుక్రవారం ఏఈ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత రైతుకు విద్యుత్ శాఖ ద్వారా నష్టపరిహారం అందించేలా చూస్తామన్నారు. ఎద్దు విలువ సుమారు రూ. 60వేలు ఉంటుందన్నారు. తమకు ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని రైతు వేడుకుంటున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


