సార్ ప్రక్రియలో 76.68 శాతం పూర్తి
అపోహలు నమ్మొద్దు.. ప్రతి ఓటు భద్రంగానే ఉంటుంది: తహసీల్దార్ మనోహర చక్రవర్తి
మర్పల్లి, (వికారాబాద్ జిల్లా): మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సార్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 76.68 శాతం పూర్తి అయినట్లు తహసీల్దార్ మనోహర చక్రవర్తి తెలిపారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మండలంలో గతంలో 45,891 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 35,187 మంది తమ సార్ ఫారాలను సమర్పించినట్లు వెల్లడించారు.ఇంకా సార్ ఫారం అందని ఓటర్లు ఎవరైనా ఉంటే వెంటనే తమ పరిధిలోని బీఎల్‌వోను సంప్రదించి ఫారం తీసుకుని నింపి ఇవ్వాలని, లేదా నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఫారం పొందవచ్చని సూచించారు. చనిపోయిన ఓటర్లకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి డిక్లరేషన్ తీసుకుని వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే చర్యలు చేపడతామని తెలిపారు.ఒక వ్యక్తికి రెండు చోట్ల సార్ ఫారాలు వచ్చినా, ఒకే చోట మాత్రమే ఫారం నింపి సమర్పించాలని, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండదని స్పష్టం చేశారు. బీఎల్‌వోలు ప్రతిరోజూ సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సార్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, మీ ఓటు పూర్తిగా భద్రంగానే ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. ఓటర్లకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉందని, ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని ప్రజలకు సూచించారు. మండలంలోని అర్హులైన ప్రతి ఓటరు సార్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
