ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్య సిబ్బంది కొరత

పార్లమెంట్‌లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్య సిబ్బంది కొరత

హన్మకొండ : వరంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల, మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రితో పాటు కేంద్ర సహకారంతో నడిచే ప్రభుత్వ వైద్య సంస్థల్లో వైద్యులు, స్పెషలిస్టులు, నర్సింగ్ అధికారులు, పారామెడికల్ సిబ్బంది కొరతపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. ఆయా సంస్థల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలను వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత మూడు సంవత్సరాల్లో ఖాళీల భర్తీకి చేపట్టిన శాశ్వత, కాంట్రాక్టు నియామకాలు, ఇతర చర్యల వివరాలను వెల్లడించాలని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆరోగ్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్ర ప్రభుత్వాలు పంపే ప్రతిపాదనల మేరకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలు హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా (HDI) నివేదికలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్యుల కొరత నివారణకు ప్రత్యేక అలవెన్సులు, ప్రోత్సాహకాలు, కాంట్రాక్టు నియామకాలు, 'యూ కోట్–వీ పే' వంటి విధానాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, ఆరోగ్యం రాష్ట్ర అంశమని చెప్పి కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సమంజసం కాదన్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రధాన వైద్య సేవలు అందిస్తున్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు, స్పెషలిస్టులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. దీనివల్ల రోగులు నాణ్యమైన వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎంజీఎం వంటి కీలక ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీల భర్తీకి కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని, తెలంగాణకు అవసరమైన అదనపు సహకారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఆరోగ్య రంగంలో బాధ్యతలను రాష్ట్రాలపైకి నెట్టివేయకుండా కేంద్రం తన వంతు బాధ్యతను నిర్వర్తించి, వైద్య సిబ్బంది ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని కోరారు.
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్ పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్
ములుగు, : పెరిక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తోట శ్రవణ్ కుమార్ కొనియాడారు.ములుగు...
దేవత్ పల్లి లో సర్వేనెంబర్ 111 లో భూములు పరిశీలించిన చండూర్ ఆర్డీవో
తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం 
ఉద్యమకారులను విమర్శిస్తే  పదవులు వస్తుందనుకుంటున్నారా?
మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్‌లో రసవత్తరంగా ఖో-ఖో పోటీలు
కోడిపాక గ్రామపంచాయతీకి రావలసిన పనులు గండి కొడుతున్న ఓ కోళ్ల పరిశ్రమ నోటీసులు జారీ 
మధుర గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుని నిమజ్జన వేడుకలు