28వ వారానికి చేరిన ‘సర్వోదయ చరక అభ్యాస’ కార్యక్రమం
పాల్గొన్న అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హన్మకొండ : గాంధేయ సిద్ధాంతాల వ్యాప్తి, స్వయం సమృద్ధి ధ్యేయంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న'సర్వోదయ చరక అభ్యాస' కార్యక్రమం నిరంతరాయంగా 28వ వారానికి చేరుకుంది. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ వారోత్సవ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చరకాతో నూలు వడికారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఆశయాలను, స్వదేశీ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గత 28 వారాలుగా ఈ అభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగిస్తు న్న నాయకులను, కార్యకర్తలను ఆయన అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గాంధేయవాదానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. చరకా కేవలం ఒక వస్తువు కాదని, అది స్వయం ఉపాధికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. నేటి యువతకు గాంధీజీ సిద్ధాంతాలను పరిచయం చేయడంలో ఈ కార్యక్రమం ఎంతో దోహదపడు తుందన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీమతి కూచన రవళి రెడ్డి, గ్రేన్ మార్కెట్ ఛైర్మన్ పులి ప్రియాంక అనిల్, స్టేట్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ ఛైర్మన్ గోవిందు శ్వేత, డీసీసీ జిల్లా కమిటీ సభ్యులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Sep 2026 18:37:17
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
