ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తికి గుడుపల్లి పెంటారెడ్డి ఘన నివాళి
షాబాద్,(రంగారెడ్డి): తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ పార్థివ దేహానికి షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడుపల్లి పెంటారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రుక్కమ్మ మరణం పట్నం కుటుంబానికి తీరని లోటని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యం, ధైర్యసాహసాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేష్,ఉపసర్పంచులు వేణుగోపాల్, దయాకర్ చారి, సర్దార్‌నగర్ ఏఎంసీ డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ రెడ్డి, మహేందర్, బందయ్య, మహేందర్ చారి, యువ నాయకులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని రుక్కమ్మకు నివాళులర్పించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


