#Draft: Add Your Title
- ఆరోగ్యశ్రీ పథకం మంద కృష్ణ మాదిగ గారి పోరాట ఫలితం ...
- ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ జిల్లా ఇంచార్జ్
హన్మకొండ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గుండె జబ్బు పిల్లల ఉచిత ఆపరేషన్ల కోసం చేసిన పోరాట ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందని జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. ఆగస్టు 7 ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ హాజరై మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మందకృష్ణ మాదిగ మాత్రమే మానవ దృక్పథంతో సమాజంలోని అన్ని వర్గాల కోసం పోరాటం చేశారని ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పైన గుండె జబ్బు ఉన్న చిన్న పిల్లలకు ఉచిత ఆపరేషన్లు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందని ఆ పోరాటంలో చిన్న బిడ్డ శోభన్ మృతి చెందడం జరిగిందని ఆ బిడ్డ శవాన్ని ఎత్తుకొని మందకృష్ణ మాదిగ గారు ట్యాంక్ బండి మీద కూర్చొని చిన్న బిడ్డలకు ఉచిత ఆపరేషన్లు చేసేవరకు ఇక్కడ నుండి కదలమని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్ల ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి మందకృష్ణ మాదిగ తో మాట్లాడి హైదరాబాద్కు తరలివచ్చిన గుండె జబ్బు ఉన్న పిల్లలకు నేడే ఉచిత ఆపరేషన్లు చేపిస్తానని ఆనాడు మాట ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్లు చేయించారని. గుండె జబ్బు కున్న చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు చేయడం వల్ల వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ ఏర్పడిందని దాని కారణంగా పేదల కోసం ఉచిత ఆపరేషన్ల కోసం తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తెస్తుందని దానికి కారణం మంద కృష్ణ మాదిగ చేసిన గుండెజబ్బు పిల్లల ఉచిత ఆపరేషన్ల పోరాటమని వైయస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. అంతేకాకుండా వికలాంగుల కోసం పోరాటం చేసి ఈనాడు వికలాంగులు 4016 లు పెన్షన్ అందుకోవడానికి కారణం మందకృష్ణ మాదిగ , వృద్ధులు వితంతుల కోసం పోరాటం చేసి వారికి పెన్షన్ 2016 రావడానికి కారణం మందకృష్ణ మాదిగ గా , వితంతువుల కోసం ఒంటరి మహిళల కోసం పోరాటం చేసి వారికి కూడా పెన్షన్ 2016 లు రావడానికి కారణం మంద కృష్ణ మాదిగ గారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ...జిల్లా కో ఇన్ఛార్జ్ తడుగుల విజయ్ మాదిగ ,ఎంఎస్పి మాజీ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ , ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు అక్కెనకుంట వెంకటస్వామి మాదిగ , జేరిపోతుల సారంగపాణి మాదిగ , ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు మంద స్వరాజ్ మాదిగ , జేరిపోతుల సతీష్ మాదిగ , బొక్క రాజేష్ మాదిగ , ఎర్ర రాము మాదిగ , రేణుకంట్ల రాజేందర్ మాదిగ , ఇమ్మడి రాజీవ్ మాదిగ , సుంచు కార్తీక్ మాదిగ , గడిపి ప్రభాకర్ మాదిగ , గడ్డం విక్రమ్ మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
