ప్రతి ఓటరుని కలవండి..
- ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములను చేయండి..
- ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు..
- పటాన్చెరు ప్రగతిలో ప్రతి ఓటు అత్యంత కీలకం..
- పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్చెరు (సంగారెడ్డి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని.. పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలంటే అర్హత కలిగిన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలు సమర్పించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ముత్తంగి డివిజన్ పరిధిలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో ఎస్ఐఆర్ అంశం పైన ముత్తంగి డివిజన్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఆశించిన మేరకు జరగడంలేదని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు 61.21 శాతం మాత్రమే నమోదు కావడం జరిగిందని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు ప్రతి రోజు కాలనీలలో తిరుగుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొనని ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి.. తమ వివరాలు నమోదు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలు బిఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే అవకాశం ఉందని.. ప్రక్రియ పూర్తయ్య వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుందని..రాబోయే వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ముందుకు కొనసాగాలని సూచించారు. సమిష్టి కృషితో ఎస్ఐఆర్ అంశంలో రాష్ట్రంలోనే నంబర్ వన్ గా పటాన్చెరు నియోజకవర్గాన్ని నిలపాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పాండు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు ఉపేందర్, శ్రీకాంత్, కుమార్ గౌడ్, శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, కొమరయ్య, రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
