స్నేహ సొసైటీలో  వైభవంగా బోనాల జాతర.

స్నేహ సొసైటీలో  వైభవంగా బోనాల జాతర.

నిజామాబాద్  :నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  తారక రామనగర్ లో గల స్నేహ సొసైటీలో శుక్రవారం వైభవంగా బోనాల జాతర  నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల   నృత్యాలతో  అంగరంగ వైభవంగా  బోనాల జాతర కొనసాగింది. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ భవనం నుండి సమీపం లోని పోలేరమ్మ ఆలయం వరకు బోనాలతో  నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ బోనాల జాతర కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ జరీనా ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లు  వివిధ వేషధారణలతో  అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడ మాసంలో  శుక్రవారం చివరి రోజు కావడంతో బోనాల జాతర ఆకట్టుకుంది. ఈ బోనాలకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా, బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. దీంతో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య ఆధ్వర్యంలోనే ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దయ్య మాట్లాడుతూ  ఆషాడ మాసంలో  బోనాల పండుగ నిర్వహించడం ఆడవాయితీగా వస్తుందన్నారు. స్నేహ సొసైటీలో  గత 2014 నుండి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది  అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ పండుగ గా బోనాలను జరుపుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని  అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు. ఈ బోనాల కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, రాజేశ్వరి, వీరేశం, స్నేహ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం