కొండపాకలో చోరీ
చిన్న వ్యాపారి దుకాణంలో నగదు, వస్తువుల అపహరణ
సిద్దిపేట జిల్లా/కొండపాక : సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కొండపాక స్టాప్ వద్ద, బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ చిన్న వ్యాపార సముదాయంలో చోరీ జరిగింది. టీ, సిగరెట్లు, బిస్కెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వడ్ల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, రోజూలాగే ఉదయం దుకాణం తెరిచేందుకు రాగా, షాపు తాళం గడ్డపారతో పగులగొట్టి ఉండడాన్ని గుర్తించాడు. దుకాణంలో పరిశీలించగా ఒక గ్యాస్ సిలిండర్, 20 సిగరెట్ డబ్బాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. అలాగే, గల్లా పెట్టెలో ఉన్న రూపాయలు 4000 నగదు కూడా అపహరణకు గురైందన్నారు. ఈ ఘటనపై బాధితుడు వెంటనే కుకునూరుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపారు.
Views: 179
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
