వ్యసన విముక్తి ప్రతిజ్ఞ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని.
నశా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే నాయిని..
హన్మకొండ: బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న“10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం” పోస్టర్‌ను ఈరోజు ఉదయం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి బ్రహ్మ కుమారిస్ ప్రతినిధులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి “నశా ముక్త్ భారత్ అభియాన్ (వ్యసన ముక్త భారత ప్రచార యాత్ర)” లో భాగంగా వ్యసనాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం మాట్లాడుతూ, మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు వంటి వ్యసనాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వ్యసన రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ BK విమల, శోభ, కల్పన, అనిల్, రాఘవ చారి, శ్యామ్, అరుణ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Sep 2026 18:25:16
ములుగు, : పెరిక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తోట శ్రవణ్ కుమార్ కొనియాడారు.ములుగు...
